Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జవహర్నగర్
జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలువురు ఆదివా రం రాష్ట్ర కార్యాలయంలో అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరా రు. ఈ సందర్బంగా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ వి. ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. భవిష్యత్తులో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, కాప్రా మండల కార్యదర్శి రుద్రవెల్లి బబ్లుచారి ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిలో జవహర్నగర్ ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మంగళంపల్లి తిరుపతి, కలిశెట్టి రాజు, షేక్ ఆరిఫ్, బొంసాని నవీన్, కోడూరి శ్రవణ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.