Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
నాచారం డివిజన్ పరిధిలోని తొమ్మిది మసీదుల వద్ద శానిటేషన్, దోమలు, సివరేజ్ వంటి సమస్యలను తలెత్తక ుండా ఎస్ఎఫ్ఏ, ఎంటమాలజీ, సివరేజ్ సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకోవాలని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం వార్డు కార్యాలయంలో మున్సిపల్ జవాన్లు ,ఎస్ఎఫ్ఏ, ఎంట మాలజీ, సివరేజ్ సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసిన ఆమె మాట్లాడుతూ జీహెచ్ఎంసీ జవాన్లు మసీదులను, పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి ముగ్గులు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎంటమాలజి సిబ్బంది ప్రతీరోజు ఫాగింగ్ నిర్వహించి దోమలు సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సివరాజ్ సిబ్బంది డ్రయినేజీల సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకొని పండుగకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సాయిజెన్ శేఖర్, జీహెచ్ఎంసీ జవాన్ కష్ణ, ఎస్ఎఫ్ఏలు శ్యామల, యాకస్వామి, నరేష్, రాజేష్, ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ, పరమేష్, సివరేజ్ సూపర్వైజర్ రాకేష్, తదితరులు పాల్గొన్నారు.