Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
దివంగత ఎమ్మెల్యే జి.సాయన్న కుమార్తె లాస్య నందిత ఆదివారం మోండా డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. లోయ నగర్లో పర్యటించిన ఆమె బస్తీ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మూడో వార్డు పరిధిలోని మడ్ ఫోర్ట్‌లోని అంబేద్కర్ హట్స్‌లో పర్యటించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న మంజూరు చేసిన మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభ మవుతాయని బస్తీవాసులకు నందిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు, వివిధ ఆలయాల చైర్మెన్లు, ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, మార్కెట్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.