Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
సముద్రాల రాఘవా చార్య ఆయన కుమారుడు సము ద్రాల రామనుజాచార్య రచించిన గీతాలు తెలుగు సాహితీ సంపద అని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కే.వీ రమణ కొనియాడారు. తెలుగు విశ్వవిద్యాలయం లోని ఎన్. టీ. ఆర్ కళా మందిరంలో యువ కళా వాహిని నిర్వహణ లో సముద్రాల రామానుజాచర్య శత జయంతి సందర్భంగా ఆయన రచించిన గీతాలపై డాక్టర్ వీ.వీ.రామా రావు రచిం చిన అందమే ఆనందం విశ్లేషణాత్మక వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ రమణ పాల్గొని సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. సముద్రాల జూనియర్ గా పిలువబడే రామనుజాచార్య అందమే ఆనం దం, ఈ నాటి ఈ హాయి, అమ్మా అని పిలిచిన అలకించ వేమమ్మ వంటి ఎన్నో సాహిత్య గుబాళింపు లు వెదజల్లే గీతాలు రాసి ఆ సినిమాల విజయానికి దోహద పడ్డారని గుర్తు చేశారు. రామా రావు ఆ గీతాల లోని సౌందర్యాన్ని విశ్లేషించి మనకు అందించారని అభినం దించారు. అధ్యక్షత వహించిన కళా పోషకుడు సారిపల్లి కొండలరావు మాట్లా డుతూ రామారావు మంచి భాష విశ్లేషణ తో సంపుటిని ఆద్యంతం చదివే విధంగా రాసార ని ప్రశంసించారు. సముద్రాల రామానుజాచర్య రచించిన కృష్ణ దాసి, శ్రీనివాస కల్యాణం సంపుటి లను ఆవిష్కరిం చారు. వేదిక పై సాహితీ వేత్త వోలెటి పార్వతీశం, గీత రచయిత సుద్దాల అశోక్ తేజ, సముద్రాల పార్ధ సారధి, సుధ, గోపాలకృష్ణ తదితరులు పాల్గొనగా సంస్థ అధ్యక్షుడు లంక లక్ష్మీ నారాయణ స్వాగ తం పలికారు. సురేఖ, డాక్టర్ రామా రావు,పద్మశ్రీ, దుర్గ తదితరులు పాడిన సముద్రాల గీతాలు ఆకట్టుకున్నాయి.