Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే ప్రజల్లో గుర్తింపు లభిస్తుందని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సముద్రాల వేణుగోపాలచారి అన్నారు. మల్లాపూర్ డివిజన్ కు చెందిన ఎస్సీ ఉపకులాల ప్రతినిధి తూర్పాటి శ్రీనివాస్‌కు బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడే వివిధ సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా కళా నిలయం సేవా సంస్థ నంది పురస్కారం అందజేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అత్యంత వెనుకబడిన కులాల ప్రజలకు నిస్వార్ధంగా సేవలు అందించినందుకు గుర్తిం పుగా నంది పురస్కారం లభించడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ప్రజలకు శక్తి వంచన లేకుండా సేవలందించేందుకు ఈ అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు. కళా నిలయం సేవా సంస్థకు రుణపడి ఉంటా నని తూర్పాటి శ్రీనివాస్ తెలిపారు. సమాజంలో పేద ప్రజలకు సేవ చేసేం దుకు స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకు రావాలని పేర్కొన్నారు.