Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి
- ప్రధాని మోడీ, బండి సంజయ్ అబద్ధాలు మాట్లాడుతున్నారు
- ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షం గా ఉందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గంగయ్య గార్టెన్‌లో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, రాష్ట్ర రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మేడ్చల్ మాజీ శాసన సభ్యులు మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ గ్రంథాలయ సంస్థ చైర్మెన్ దర్గా దయాకర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమ్మేళనానికి ఇంతపెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం చాల సంతోషంగా ఉందన్నారు. తాను చిన్న నాటి నుండి కష్టపడి, క్రమశిక్షణతో ఎదిగానని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టీడీపీలో ఎంపీగా గెలిచానని, కేసీఆర్ మీద ఉన్న ప్రేమతో టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా అయ్యానని గుర్తు చేశారు. నా జీవితానికి ఇది చాలని ప్రజలకు మరింత సేవ చేయడానికి మరోసారి అవకా శం కల్పించాలని కోరారు. మల్లారెడ్డి ట్రెండింగ్ డైలాగ్ పాలమ్మిన, పూలమ్మిన, కాలేజీలు నిర్మించిన అని సభనంత కాసేపు సందడి చేశారు. భూమి, డబ్బులు, కొదవలేదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలకు వాచ్ మెన్‌గా డ్యూటి చేస్తున్నాని తెలిపారు. గత ప్రభుత్వాలు రా చెరువును పట్టించుకున్న పాపాన పోలేదని రూ.20 కోట్లు పెట్టి శుద్ది చేపించానని, అలాగే 110 కోట్లతో ఎస్.ఎన్.డీపీ ప్రాజెక్టును ప్రారంభించానని తెలిపారు. బోడుప్పల్ ప్రదాన సమస్యలైన వక్ఫ్ బోర్డు, ల్యాండ్ పూలింగ్లను త్వరలోనే పూర్తిచేస్తానని హమీ ఇచ్చారు. నగర దళితులకు దళిత బంధు, గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు లేని మహిళలు అప్లైచేసుకోవాలని తెలిపారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృ ద్ధిలో దూసుకెళ్తుంటే ప్రధాని మోడీ, బండి సంజరు అబ ద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ, ప్రయివేటు, ఐటీ ఉద్యోగాలు లక్షల్లో కల్పిస్తున్నామని తెలిపారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నీళ్లు నియమాకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని, అది కేసీఆర్ నాయకత్వంలో సిద్ధించిందన్నారు. సాధించుకున్న తెలంగా ణలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని సుభిక్షంగా ప్రజలకు పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఆత్మీయ సమ్మేళ నాలలో నగర ప్రజల, కార్యకర్తల బాగోగులు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు అందుతున్నా యా లేదా అనేది సుదీర్ఘంగా చర్చించుకోవాలని సూచించారు. రాబోయేది ఎన్నికల కాలమని సంక్షేమ పథక ాలు క్రింది వరకు అందేలా చూడాలన్నారు. అదేవిధంగా బోడు ప్పల్‌లోని ప్రదాన రోడ్లను వెంటనే బాగు చేసుకోవాలన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి జిల్లా ప్రజాప్రతినిధులం దరిని పిలవకుండా అవమానించడం తగదని, ఇలాంటి విషయాలు మరలా పునరావృతం కాకుండా చూడాలనడంతో మంత్రి మల్లారెడ్డి కలుగజేసుకొని మైకును గుంజు కునే క్రమంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి సముదాయించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, పార్టీ ప్రదాన కార్యదర్శి మీసాల క్రిష్ణ, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.