Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఘట్కేసర్
ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 105వ వారం నిత్య పూలమాల కార్యక్రమం జరిపారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా ఎక్సైజ్ సీఐ ఎం. మల్లయ్య పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమా లవేసి నివాళ్లర్పించారు, మల్లయ్య మాట్లాడుతూ అంబెడ్కర్ రాజ్యాంగం వల్లే తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని.. తాను ఒకడినే కాదు దేశంలో సబండ వర్గాలు సామా జికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ఎదుగుతున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు అయన రాసిన రాజ్యాంగాన్ని, రచనలు చదివి అయన ఆలోచనా విధానాన్ని ముందుకు తీసుకెళ్లా ల్సినా అవస రం ఉంద న్నారు. మీసాల అరుణ్ కుమార్ అంబేడ్కర్ జీవిత చరిత్ర ను తెలియజేశారు. మేకల దాస్, తోక బాలయ్య, కే.నర్సింగ్ రావు, ఇరిటం శ్రీనివాస్ చిలుగురి ఆనంద్, వై.వెంకటేశ్వర్ రావు, కే.మహిపాల్, జి.అంజయ్య, యూ.వెంకటేష్, ఎల్.రాజు, ఎస్.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.