Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఉప్పల్
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షులు మందు ముల పరమేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఉప్పల్ నియోజ కవర్గం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తెలి పారు. రానున్న ఎన్నికలో ఉప్పల్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ పరిధిలోని నాయ కులు, కార్యకర్తలతో మందుముల పరమేశ్వర్‌రెడ్డి ఆదివారం 'మాట-ముచ్చట' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ గడ్డ...కాంగ్రెస్ పార్టీకి కంచు కోట అని గుర్తు చేశారు. రాష్ట్రంలో అభివద్ధి జరుగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ,, ప్రజా మద్దతును కూడకట్టుకుంటూ ముం దుకు సాగాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రతినిధులు మేకల శివరెడ్డి, తొఫిక్, టీపీసీసీ సెక్రట్రీ పసుల ప్రభాకర్ రెడ్డి, దుబ్బ నర్సింహా రెడ్డి, రాఘవా రెడ్డి, బోరంపేట కృష్ణ, అంజి రెడ్డి, గాఢం లక్ష్మ రెడ్డి, సుర్వి మురళి గౌడ్‌తోపాటు తడవబోయిన గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.