Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ది శంకర్ గౌడ్
నవతెలంగాణ- సరూర్నగర్
పేదలకు చేయూతను అందించేందుకు రెడీ టు సర్వ్ ఫౌండేషన్ కృషి చేస్తుందని ఫౌండేషన్ చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ అన్నారు. ఆదివారం గాంధీ ఆస్పత్రి దగ్గర ఉన్న అనాధలకు రోగుల సహాయకులకు అన్నదాన కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఆల్క మనోజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ నేతృత్వంలో ప్రతి ఆదివారం ఒక్కో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆనాథలకు, రోగులకు అన్నిదానం కార్యక్రమాన్ని గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. పేద రోగులకు అవసరమయ్యే మందులు సైతం అందించడం గొప్ప విషయమన్నారు. తలసేమియా, క్యాన్సర్, గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ పెద్ది శంకర్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతోపాటు అన్నదాన కార్యక్రమాలను విస్తతంగా నిర్వహిస్తామని తెలిపారు. సుమారు 400 మందికి అన్నదానం చేసినట్టు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో వై.వి చౌదరి, యూరాలజిస్ట్ డా.సంయుక్త, షరీఫ్, కోర్డినేటర్ ప్రకాష్, ప్రవీణ్ గుప్తా, శివచైతన్య, నవీన్, బీ.టీ. నాయుడు, ప్రశాంత్, నితిన్, నరేందర్, బాలు పాల్గొన్నారు.