Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ మాజీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస గుప్త
నవతెలంగాణ-నాగోల్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆర్యవైశ్యులకు సరైన న్యాయం జరిగిందని రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ మాజీ చైర్మెన్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర విభాగం అధ్యక్షులు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాసగుప్త అన్నారు. శనివారం రాత్రి సికింద్రాబాద్ పీజీ రోడ్డులోని జూలూరి వీరేశలింగం కళ్యాణ మండపం రూఫ్ గార్డెన్లో ఆర్యవైశ్య అభ్యుదయ సంఘంలో జరిగిన ఆర్యవైశ్య క్లబ్ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహౌత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆర్యవైశ్య క్లబ్ 20203-24 మేనేజింగ్ నూతన కమిటీ అధ్యక్షులుగా కొంచెం సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరు వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కె.వి లక్ష్మీనారాయణలతో పాటు కమిటీ సభ్యు లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ఉప్పల శ్రీనివాసగుప్తను పూలమాలతో సత్కరించి శాలువాతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్య జాతికి గుర్తింపు ,గౌరవం దక్కిందన్నారు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి న్యాయం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరు మాత్రమే అని చెప్పారు. ఉప్పల్ భగాయత్‌లో ఐదు ఎకరాల భూమిని కూడా ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులకు పదవులు ఇచ్చారని తెలిపారు. ఆర్యవైశ్యులు కేవలం వ్యాపారలకే పరిమితం కాకుండా సామాజిక సేవలో కూడా ముందుం టారని పేర్కొన్నారు ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తామని, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మేనేజింగ్ కమిటీ అధ్యక్షులు సురేష్ బాబు, వెంకటేశ్వరరావు, పాటు ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.
10కే రన్‌ను ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త
ఆదివారం ఉదయం ఓమ్ని ఆసుపత్రి, కేఎన్ఆర్ సైకిల్ ఈవెంట్ సంయుక్త ఆధ్వర్యంలో చార్మినార్ టూ గోల్కొండ ఫోర్టు హిస్టారికల్ 10కిలోమీటర్ల రన్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మెన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త చార్మినార్ వద్ద జెండాను ఊపి 10కే రన్‌ను ప్రారంభిం చారు. చార్మినార్ సబ్ ఇన్స్పెక్టర్, తెలంగాణ పోలీస్ టీం, జీహెచ్ఎంసీ టీం, టీఎస్ ఆర్టీసీ టీం, ఔత్సాహికులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.