Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- బాలాపూర్లో ఆత్మీయ సమ్మేళన సభ
నవతెలంగాణ-బడంగ్పేట్
నా జీవిత కాలం ప్రతి నిత్యం ప్రజా సేవకే అంకితం చేయటం జరుగుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పీ.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బాలాపూర్ గ్రామంలోని ఏ.వై.అర్ గార్డెన్లో బీ.అర్.ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాలర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ నాయకుల్లారా అభివృద్ధి కోసం పోరాడుదాం, నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే ఖబర్దార్ అని మంత్రి హెచ్చరించారు. 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర గల తన కుటుంబం, తాను మంత్రి కావాలి అని నా మనసులో అనుకుంటే 22 సంవత్సరాల కిందటే మంత్రి అయ్యేదాన్ని అని ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ బాలాపూర్ నాయకులు బైక్ ర్యాలీ పాదయాత్రగా బాలాపూర్ గ్రామాన్ని పర్య టించి ఆత్మీయ సమ్మేళన సభకి విచ్చేసిన మంత్రికి అడుగడుగునా జనం నీరాజనం పలికారు. గృహ ఉపయోగలకు, పరిశ్రమల వినియోగదారులకి ఎన్ని గంటల విద్యుత్ ఉండే దని, ఇప్పుడు ఎన్ని గంటల విద్యుత్ నిరంతరాయంగా ఉంటుందని, మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండని ప్రతిపక్ష నాయకులను ఉద్ధేశిస్తూ అన్నారు. ఇది అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ ద్వారా ఆడబిడ్డలు మంచినీటి కోసం రోడ్డుమీదికి వెళ్లకుండా మంచినీటి నల్ల కనెక్షన్లు మీ ఇంటి వద్ద కేసీఆర్ ది కాదా, నిరుపేద కుటుంబాలు ఆడబిడ్డ పెళ్లి చేస్తే అప్పుల పాలైన వారికి మేనమామ లాగా వారికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వార ఒక లక్ష 16 వేల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సే అన్నారు. మహేశ్వరంలో అభివద్ధి చేశాను, మరింత అభివద్ధి చేస్తాన్నారు. తాను చేసిన అభివృద్ధి నా బలగంతో నేడు ఆత్మీయ సమ్మేళనం ద్వారా తెలుపుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగేటి లక్ష్మారెడ్డి, కళ్ళెం ఎల్లారెడ్డి, కార్పొరేటర్ జనగే భారతమ్మ కొమరయ్య యాదవ్, కోఆప్షన్ సభ్యుడు గుండోజి రఘునందన్ చారి, అత్తాపురం శ్రీనివాసరెడ్డి, చిగిరింత శ్రీరామ్ రెడ్డి, తిమ్మని గిరేష్, జూకంటి సురేష్ గౌడ్, కొప్పుల రాజు, హరి గౌడ్, అరవింద్ గౌడ్, బాలాపూర్ ఉద్యమ నాయకుడు జీహెచ్ యాదగిరి, బీఆర్ఎస్ పార్టీ యువనాయకుడు వొంగటి అశ్విన్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, సుమంత్ రెడ్డి, బీఆర్ఎస్ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
నాదర్గుల్ గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గుల్ గ్రామంలోని 8, 9వ డివిజన్లలో 56 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డితో కలిసి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరికొన్ని దశలవారీగా జరుగుతాయన్నారు.డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, జీ.ఇంద్రసేన, తోట శ్రీధర్ రెడ్డి, కో ఆప్షన్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి, భాగ్యనగర్ బ్యాంకు చైర్మన్ మర్రి సింహారెడ్డి, మాజీ సర్పంచ్ సుదర్శన్ రెడ్డి, కోటగిరి జంగయ్య, మాజీ కౌన్సిలర్ మంజుల కుమార్ గౌడ్, మాజీ కౌన్సిలర్ యాదయ్య, నాయకులు పెద్దబావి ఆనంద్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.