Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
నైట్ క్యాంప్‌ల వలన విద్యార్థులలో దాగి వున్న సృజాత్మకతను వెలికి తీసి వారికి ఇష్టమైన రంగాల పట్ల అవగాహన కల్పించడమే వీటి లక్ష్యమని అక్షర పాఠశాల సీఈఓ మదన్ మోహన్ రావు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సదస్సులను విద్యార్థులు ప్రత్యక్షంగా అనుభవించి ఆనందించబడే గొప్ప వేదికలన్నారు. ఒకరోజు రాత్రిపూట విద్యార్థినీవిద్యార్థులు ఇంటిని, తల్లిదండ్రులను, పుస్తకాలను, దూరంగా పెట్టి, స్వేచ్ఛగా విహరించే ఒక నందన ఉద్యానవనం లాంటిదని అభిప్రాయపడ్డారు. నైట్ క్యాంప్‌లో విద్యార్థినీ విద్యార్థులకు భద్రతలతో పాటు అన్ని సౌకర్యాలు సమ కూర్చామని తల్లిదండ్రులు పిల్లలను ఈ శిబిరానికి పంపించాలని కోరా రు. అనంతరం ప్రిన్సిపాల్ రమణి వారణాసి మాట్లాడుతూ విద్యార్థులకుకు నూతన ఉత్తేజంతోపాటు తోటి మిత్రులతో కలిసి ఆటలాడుకోవడం, సాంస్కతిక కార్య్రమాలలో పాల్గొనడం వలన సమైక్యత, సమభావం వంటి అనేక ఉత్తమ లక్షణాలను అలవరచు కోవడానికి ఈ వేదిక అద్భుతమైన అవకాశమన్నారు. ఇలాంటి అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు చర్య లు తీసుకోవాలని కోరారు. ఈ నైట్ క్యాంప్ సమ్మిట్‌లో భాగంగా బలాబలాల ప్రదర్శన, బాంబు పేలుడు, కుండలు తయారు చేసే విధానం విలువిద్య ప్రదర్శన రైఫిల్ షూటింగ్, ఆర్టీలరీ, ఒంటె రైడింగ్ క్యాంఫైర్, స్లైడర్ల పట్ల అవగాహన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. పాఠశాల సిబ్బంది అధ్యాపక బందం పాల్గొన్నారు.