Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
- జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజావాణి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా జిల్లాలో వివిధ సమస్యలపై ఫిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుంచి జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి , జిల్లా రెవెన్యూ అధికారి లింగ్య నాయక్, డీఆర్డీఎ పద్మజారాణి తో కలిసి 83 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికారులు శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అర్జీలను పెండిం గ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.