Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగు తోంది. భానుడి భగభగను తట్టుకోలేక జనం విలవిల్లా డుతున్నారు. బయటకు రావాలంటేనే హడలెత్తి పోతు న్నారు. ఈ క్రమంలో సోమవారం భాగ్యనగరంలో ఒక్కసా రిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. నగరం లోని పలుచోట్ల తేలికపాటి వర్షంతో పాటు వడగళ్లు కురిశా యి. నాంపల్లి, హైకోర్టు ప్రాంతాల్లో వడగళ్ల వానపడింది. చంచల్‌గూడ, సైదాబాద్, చంపాపేట, గోషామహల్, బేగంబజార్, బహదూర్‌పురా, కోఠి, అబిడ్స్, నారాయణ గూడ, హిమాయత్‌నగర్, లిబర్టి, బషీర్‌బాగ్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో వడగళ్ల వాన కురిసింది. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్‌బజార్‌తో పాటు పలు ప్రాంతాల్లో వడగళ్లు కురిశాయి.
నగరాన్ని మేఘాలు కమ్మేయడంతో పాటు ఈదురు గాలులు, వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎండ వేడితో జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి కాగా, సాయంత్రం ఒక్కసా రిగా ఈదురుగాలులతో వర్షం కురవడంతో వేడి నుంచి ఉపశమనం పొందారు. మరో వైపు రాగల రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.