Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్ పర్సన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని దమ్మాయిగూడా మున్సిపల్ చైర్ పర్సన్ వసూపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సోమవారం కంటి వెలుగు రెండో విడతలో భాగంగా దమ్మాయిగూడ పురపాలక సం ఘం పరిధి 11వ వార్డు మారుతి నగర్లోని గణేష్ మండపం వద్ద ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాన్ని దమ్మాయిగూడ చైర్ పర్సన్ వసుపతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ ప్రారంభిం చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ ఇంట్లో కంటి వెలుగులు నింపేందుకు కంటి వెలుగు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మొత్తం 102 మందికి కంటి పరీక్షలు చేసి, 32 మందికి (20 మందికి రీడింగ్ అద్దాలు, 12 మందికి పర్మినెంట్ అద్దాలు) అందజేశారు. 9 మంది కి కంటి పరీక్షల ఆపరేషన్ నిమిత్తం తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మెన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ స్వామి, కౌన్సిలర్ గురువెల్లి వెంకటరమణ పాల్గొన్నారు.