Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యమంత్రికి అవుట్సోర్సింగ్ కార్మికుల లేఖ
నవతెలంగాణ-నాచారం
జలమండలి అవుట్సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని కోరుతూ సీఎం కేసీఆర్ కు అవుట్సోర్సింగ్ కార్మికు లు లేఖ రాశారు. అవుట్సోర్సింగ్ కార్మికుల సంఘం నాయకు డు డి బాబు మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెట్రో వాటర్ వర్క్స్ విభాగంలో సుమారు 4000 మంది జలమండలి అవుట్సోర్సింగ్ కార్మికులుగా విధులు నిర్వహి స్తూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. మెట్రో వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్ , అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (బీఆర్ఏస్ కేవీ) అనుబంధంగా కొనసాగుతున్న కార్మికుల మన్నారు. తెలం గాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జలమండలి అవుట్సోర్సింగ్ కార్మికులకు రూ.11000 వేతనం ఇచ్చి ఆదుకున్నారు సీఎం కేసీఆర్ అన్నారు. అయితే తాము చాలీ చాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తూ గరంలో బతకడం కష్టంగా ఉందని కార్మికులు పోస్ట్ కార్డు రాసి... పోస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. జలమండలి అవుట్సో ర్సింగ్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి జీవో నెంబర్ 14ను సాధించు కోవడం జరిగిందని గుర్తు చేశారు. గత రెండేండ్లుగా కార్మికులకు వేతనాలు పెంచాలని అనేక పద్ధతిలో కషి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోస్టు కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ పట్ల ప్రభుత్వం స్పందిం చకపోతే. ఈ నెల 20వ తేదీ అనంతరం కార్మికులు ఐక్యంగా ఆందోళన, పోరాటాలు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని మెట్రో వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్, అవుట్సో ర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు నారాయణ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అంగీ కారంతో, ఎండి సహకారంతో జలమండలి అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని సీఎంను కోరారు.