Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నేరేడ్ మెట్
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని మౌలాలిలో పలు ప్రాంతాల్లో సోమవారం రూ 2 కోట్ల అంచనా వ్యయంతో పలు కాలనీలలో చేపడుతున్న అభివద్ధి పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రారంభించారు. ఆఫిసర్స్ కాలనీ,లక్ష్మి నగర్, క్రియేటివ్ నగర్,గాయత్రీ నగర్,అండల్ నగర్, జోహార్ నగర్,షఫీ నగర్,హనుమాన్ నగర్ శంకర య్య కాలనీ లలో సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు అలాగే మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని బండ చెరువు, ఆర్ కె పురం చెరువుల ను సోమవారం ఎమ్మెల్యే హన్మంత రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ శాఖల అధికా రులతో కలిసి పరిశీలించారు. బండ చెరువు దోమల సమస్యతో తీవ్ర ఇబ్బంది అవుతుందని గుర్రపు డెక్క తొలగించాలని బండ చెరువు డిసిల్టింగ్ చేయాలని, చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, చెరువు సుందరీకరణకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువు పూడిక తీత, సుందరీకరణ, దోమల సమస్యలపై దష్టి సారించాలని కోరారు. కార్పొరేటర్లు రాజ్యలక్ష్మి, ప్రేమ్ కుమార్,డిసి రాజు,ఈ ఈ లక్ష్మన్,ప్రాజెక్ట్ సీఈ సురేష్,ఎస్ ఈ బాస్కర్ రెడ్డి,డీఈ పవన్, వాటర్ వర్క్ జీఎం సునీ ల్ కుమార్, డిప్యూటీ ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి, డీఈ లౌక్య, ఏఈ సత్యలక్ష్మి పాల్గొన్నారు.