Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జవహర్నగర్ మేయర్ మేకల కావ్య
నవతెలంగాణ-జవహర్నగర్
ప్రగతి పనుల్లో అధికారులు అలసత్వం ప్రదర్శించరాదని, ప్రధాన రహదారి పనులు త్వరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు మేయర్ మేకల కావ్య సూచించారు. సోమవారం కార్పొ రషన్ కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టర్లతో మేయర్ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా మేయర్ మాట్లాడుతూ మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డిల ఆదేశాల మేరకు 20రోజుల్లో రోడ్డు పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావలని, లేని పక్షంలో అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అభివద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ రూ.30కోట్లు మంజూరు చేస్తామడం సంతోషంగా ఉందన్నారు. కార్పొరే షన్ను అందంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐర్డీసీఎల్ డీఈఈ, మున్సిపల్ డీఈ మురళి, ఏఈ రాజశేఖర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
పట్టాల పంపిణీ....
కార్పొరేషన్ లోని పలు డివిజన్లలో లబ్దిదారు లకు ఇండ్ల పట్టాలను సోమవారం మేయర్ పంపిణీ చేశారు. తహశీల్దార్ అనిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.