Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాచారం
మతసామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ నిలుస్తుందని కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ అన్నారు. సోమవారం బాబా నగర్ లోని నూరు గౌసియా మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మైనారిటీ సోదరుల ఒక్కపొద్దు దీక్షలను విరమింప చేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ కుల మత భేదాలను పక్కనపెట్టి హిందూ, ముస్లిం బారు బారు కలిసి మెలిసి ఇఫ్తార్ విందు లు నిర్వహించడం ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా సుమారు 700 మందికి ఇఫ్తార్ విందును నూరు గౌసియా మసీద్ ప్రెసిడెంట్ మహమ్మద్ జబ్బార్ సాహెబ్, ప్రధాన కార్యదర్శి తోఫిక్ సాహెబ్ ఏర్పా టు చేసినట్లు పేర్కొన్నారు. మైనారిటీ సోదరులు ఆజాం, జిలాని, అక్రమ్, ఆలీ, సమీర్, జునాద్, జిలాని, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మేకల ముత్యం రెడ్డి, నాయకులు సాయిజెన్ శేఖర్, కట్ట బుచ్చి గౌడ్, చంద్రశేఖర్, శ్రీనివాస్, జహంగీర్, బాలమణి, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నేరేడ్మెట్ : రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారి పండుగలకు సమప్రాధాన్యత ఇస్తుందని వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు ఆదేశాల మేరకు వారు అంబేద్కర్ నగర్ మజీద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు అందజేస్తున్న బట్టలను పంపిణి చేసి ఇఫ్తార్‌లో పాల్గొ న్నారు. కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ హయాం లో పేదలు పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఈ సమ యంలో నూతన దుస్తులను తన కానుకగా సీఎం కేసీఆర్ అందజేస్తున్నారన్నారు. రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.నాయకులు మోసిన్, బాస్కర్, ముత్యాలు, అమత, జానధర్, ప్రబన్, స్వప్న, ప్రబన్, ప్రబన్, కల్పన తదితరులు పాల్గొన్నారు
కాప్రా : మీర్పేట్ హెచ్‌బీ కాలనీలోని మసీదులో కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి రంజాన్ తోఫాలు పంపిణీ చేశారు. అనం తరం కార్పొరేటర్ మాట్లాడుతూ అన్ని మతా లకు ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు. మైనారిటీ అధ్యక్షులు అలీముద్దిన్, సెక్రటరీ నిసార్ అహ్మద్ గోరి, మహ్మద్ షకీల్, దండెం నరేందర్, ముస్లిం సోదరి సోదరులు తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో చర్లపల్లి డివిజన్ సిరి గార్డెన్స్‌లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఉపవాసం ఆచరి స్తున్న ముస్లిం సోదరులకు ఖజ్జూరాలు, పండ్లు తినిపించి దీక్షను విరమింపజేశారు. అనంతరం వారితో పాటు మాజీ మేయర్ రామ్మోహన్,కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ నమాజును ఆచరించి దువా చేశారు. రామ్మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో అష్టైశ్వ ర్యాలతో ఉండాలని తాను ఎప్పుడూ కోరుకుంటానని అన్నా రు. హౌంమంత్రి మహమూద్ ఆలీ, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ,మేయర్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి ,చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, కార్పొరేటర్లు గీత ప్రవీణ్ ,దేవేందర్ రెడ్డి ,స్వర్ణ రాజ్ ,మాజీ కార్పొరేటర్ అంజయ్య ,గంధం జ్యోత్స్న నాగేశ్వర్ రావు ,హన్మంతు రెడ్డి ,గోపు సరస్వతి సదానంద్ పావని రెడ్డి తదితరులు పాల్గొన్నారు.