Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
కత్రిమ ఊపిరితిత్తులపై ఉన్న 48 ఏండ్ల రైతుకు సరికొత్త జీవితాన్ని యశోద హాస్పిటల్స్ వైద్యులు కల్పించారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డాక్టర్. హరి కిషన్ గోనుగుంట్ల ఈ విషయాన్ని వెల్లడించారు. 'జయశంకర్ భుపాలపల్లి జిల్లా, పోచంపల్లి గ్రామానికి చెందిన కట్ల నరసింహ రెడ్డి అనే 48 ఏండ్ల సాధారణ రైతు, గత నెలలో కరోనా వైరస్ బారిన పడి సాధారణ జ్వరం, దగ్గుతో స్థానిక ఆసుపత్రిలో చేరాడు. అక్కడ సాధారణ కోవిడ్ చికిత్స ప్రారంభించినప్పటికి దురదష్టవశాత్తు అతని ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణించింది. రోజులు గడిచేకొద్దీ అతని పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సపోర్టుతో సికింద్రాబాద్‌లోని యశోద హాస్పిటల్స్‌కు తీసుకురావడం జరిగింది. తీవ్ర కోవిడ్ వ్యాధి బారినపడి అత్యంత విషమపరిస్థితిలో ఉన్న అతన్ని మార్చి 7న యశోద అత్యవసర విభాగానికి రాగానే అతన్ని కాపాడటానికి అతనికి వెంటిలేటర్ సపోర్టుతో పాటు అదనపు కార్పోరియల్ ఊపిరితిత్తుల మద్దతు (ఈసీఎంఓ) ఆర్టిఫిసియల్ లంగ్స్ (కత్రిమ ఊపిరితిత్తులు) అవసరమని స్పష్టమైంది. అదే విషయాన్ని పేషెంట్ కుటుంబసభ్యులకు వైద్యులు వివరించి వారి ఆమోదంతో 'ఎక్మో'పై వైద్యం అందించారు. కరోనా రోగులలో ముఖ్యంగా రోగి ఊపిరితిత్తులలో ఉండే వైరస్ తీవ్రతను బట్టి రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా వేస్తారు. సాధారణంగా కరోనా చికిత్సలో అత్యంత కీలకమైన సమయం 4-6 వారాలు, తరువాత ఎక్మో మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందిలో ఊపిరితిత్తుల మార్పిడి అవసరం కూడా ఉంటుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నిపుణులైన ఆస్పత్రి క్రిటికల్ కేర్ బందం, ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ లు అతని అవసరాలకు అనుగుణంగా అతనికి తగిన చికిత్స అందించారు. అతను యశోద హాస్పిటల్‌కు రావడానికి ముందు కరోనా కారణంగా అతని ఊపిరితిత్తులకు విస్తతమైన నష్టం జరిగింది. అధిక ఆక్సిజన్ అవసరాలతో అతని అనారోగ్యం క్లిష్టమైన దశలో వెంటిలేటర్ పై ఆధారపడి ఉన్నాడు. ముఖ్యంగా ఈ చికిత్స సమయంలో అతడికి వెంటిలేషన్, ప్రోనింగ్, ప్రారంభ ట్రాకియోస్టోమీ, మార్గదర్శక-ఆధారిత అత్యాధునిక వైద్యంతో పాటు ఇంట్యూబేషన్ మరియు మెకానికల్ వెంటిలేషన్ అవసరమయ్యాయి. వారం రోజుల చికిత్స ముగిసే సమయానికి ఆస్పత్రి వారు అతనిని ''వెంటిలేటర్, ఎక్మో'' నుండి విజయవంతంగా బయటికితేగాలిగం. ఆక్సిజన్ సపోర్ట్ కూడా లేకుండా సంతోషంగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయగలిగాం' అని తెలిపారు.