Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నైపుణ్యత శిక్షణా తరగతులకు విశేష స్పందన లభిస్తోంది. జీహెచ్ఎంసీ సహకారంతో హైదరాబాద్‌లో మొదటిసారిగా లైట్ హౌస్ సంస్థ ద్వారా చందానగర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. నైపుణ్యత శిక్షణ కోసం నిరుద్యోగ యువతీ, యువకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఏడాదికి 600 మంది యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నైపుణ్యత శిక్షణను అందిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 75 మందికి శిక్షణా తరగతులు ప్రారంభించారు. లైట్ హౌస్ సంస్థ పూణెలో నైపుణ్యత శిక్షణ కేంద్రం ద్వారా చాలా మందికి ఉపాధి కల్పించింది. ప్రిన్సిపాల్ గ్లోబల్ సంస్థ యువతకు వివిధ ట్రేడ్లలో శిక్షణ కల్పించేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, శిక్షణకు సంబ ంధించిన పరికరాలు, సామగ్రి, ఇతర అవసరమైనవి సీ.ఎస్.ఆర్ ద్వారా లైట్ హౌస్‌కు సహాయ, సహకారం, ప్రోత్సాహం అందించ డం మూలంగా పూణెలో 22 వేల మంది యువకులు శిక్షణ కోసం నమోదు చేసుకోగా అందులో 16,600 మంది శిక్షణ కల్పించింది. వారిలో 11,500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పా టు ఉన్నత చదువు కోసం వెళ్లేందుకు ప్రోత్సాహాన్ని అందించారు.
జీహెచ్ఎంసీ ప్రొత్సాహంతో ముందడుగు
హైదరాబాద్‌లో ప్రిన్సిపాల్ గ్లోబల్ సంస్థ సహకారం, జీహెచ్ఎంసీ ప్రోత్సాహంతో లైట్ హౌజ్ సంస్థ చందానగర్ సర్కిల్ హుడా కాలనీలో శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. ఏప్రిల్ 10 స్కిల్ సెంటర్‌ను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, శేరిలింగంపల్లి ఎమ్మెలేÊ అరికెపూడి గాంధీ, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు.
ప్రతి బ్యాచ్‌కు 25 మంది..
శేరిలింగంపల్లి జోన్‌లోని పలు కాలనీలో గల తక్కువ ఆదాయం గల యువతను గుర్తించి 3 బ్యాచ్‌లకు ఒక్కక్క బ్యాచ్‌కు 25 చొప్పున 75 మంది యువతకు శిక్షణ కల్పిస్తున్నారు. ఐదు గదులతోపాటు ఒక వీడియో కాన్ఫరెన్స్ హాల్‌ను ఏర్పాటు చేశారు. భవనంను ప్రారంభించక ముందు హైదరాబాద్ లో 160 మంది రిజిస్టర్ చేసుకోగా అందులో 56 శిక్షణకు నమోదు అయిన వారిలో 38 మందికి ప్లేస్ మెంట్ కల్పించారు.
నైపుణ్యత, శిక్షణ కోర్సులు..
హాస్పిటల్ ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్, అకౌంట్స్, ఆటోమొబైల్స్ సేల్స్, కస్టమర్ కేర్, రిటైల్ ఎగ్జిక్యూటివ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫార్మసీ అసిస్టెంట్, బ్యూటీ అండ్ వెల్నెస్ ఫ్యాషన్ డిజైనింగ్, హార్డ్‌వేర్, నెట్వర్కింగ్ డెవలపర్ (జావా పైతాన్ డాట్ నెట్ సప్) ఆటో క్యాడ్ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ గ్రాఫిక్ డిజైనర్ కోర్సుల్లో నైపుణ్యత శిక్షణ ఇవ్వనున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి : జీహెచ్ఎంసీ కమిషనర్
18 ఏండ్ల నుంచి 35 ఏండ్ల వయస్సు గల యువతీ యువకులు అర్హులు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ డెవలప్మెంట్, డిజిటల్ లిటరసీ, స్పోకెన్ ఇంగ్లీష్, కెరీర్ కౌన్సెలింగ్, ఒకేషనల్ స్కిల్లింగ్ కోర్స్/కౌన్సిలింగ్, తదుపరి ప్లేస్ మెంట్ కల్పిస్తారు. గ్లోబల్ సర్వీస్ గ్లోబల్ హెడ్ అయిన జాన్ కౌచర్తో కలిసి కమిషనర్ శిక్షణా సెంటర్‌ను సందర్శించారు. విద్యార్థులతో సంభాషించి ట్రైనింగ్ వివరాలను తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తామనీ, లైట్ హౌస్ సి.ఈ.ఓ రుచి మాథుర్ తెలిపారు. ఆసక్తి గల వారు స్కిల్ సెంటర్‌ను సంప్రదించాలని కోరారు.