Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
2014లో బీజేపీ కేంద్రంలో అధికారం వచ్చినప్పటి నుంచి నేటి వరకు ప్రధాని మోడీ దుర్మార్గపు పనులకు, తప్పుడు వాగ్దానాలకు, అత్యున్నత మోసాలకు దేశ ప్రజలం దరూ బాదితులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈ.టి.నరసింహ అన్నారు. బీజేపీ నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలను 'బీజేపీ హటావ్-దేశ్ బచావ్' నినాదంతో సోమవారం హిమాయత్‌నగర్ డివిజన్లోని విఠల్వాడి, గాంధీ కుటీర్, నారాయణగూడ, దత్తనగర్, పలు బస్తీల్లో ఇంటింటికీ సందర్శించి బీజేపీ ప్రభుత్వం తిరోగమన విధానాలు, మోసాలను ప్రజలకు వివరించి, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ప్రజలను కోరారు. ఈ సందర్బంగా ఈటి.నరసింహ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మించిన మోసగాడు, అబద్ధాల కోరు ప్రపంచంలోనే మరొకరు లేరన్నారు. స్విస్ బ్యాంకు నుంచి నల్లధనం తీసుకువచ్చి దేశంలోని ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని హామీని చ్చారనీ, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనీ, ప్రతి ఏడాదీ నిరుద్యోగ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనీ, 2022 నాటికి ప్రతి భారతీయునికీ ఒక ఇల్లు, పట్టణ ప్రాంతాల్లో 54 లక్షల గృహాలు నిర్మిస్తామనీ, 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకె ళ్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రధాని మోడీ దేశ ప్రజలను దగా చేశారన్నారు. ప్రశ్నించే గొంతుకలను సాక్ష్యలు లేకుండా నకిలీ కేసులు పెట్టి సీబీఐ వేధించడం, ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసినట్టు తగినన్ని సాక్ష్యలు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీపై కేసులు నమోదు చేసి 'పంజరంలో చిలుక' సీబీఐ కాదని నిరూపించుకోవాల న్నారు. ఎల్ఐసి, ఎస్బిఐ, ప్రభుత్వ రంగ సంస్థల డబ్బులు భారీ నష్టాలకు దారి తీసిన అదానీ కంపెనీల్లో పెట్టుబ డులుగా మోడీ పెట్టించడం వల్ల కోట్లాది మంది పేద, మధ్య తరగతి ప్రజల కష్టార్జితానికి భద్రత లేకుండా పోయిందన్నారు. దేశ సంపదను అమ్ముకోవడంతో పాటు దేశ ప్రజలను మోసం చేసేందుకు బీజేపీ యంత్రాంగం భారీ వ్యూహం పన్నిందనీ, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. బీజేపీ మతం, కులం, భాష ప్రాతిపదికన దేశ ప్రజలను విభజిస్తుందనీ, దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడిం చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హైదరా బాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి, సహాయ కార్యదర్శు లు కమతం యాదగిరి, బి.స్టాలిన్, కార్యవర్గ సభ్యులు నెర్ల కంటి శ్రీకాంత్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెం కటేశం, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి గ్యార నరేష్, సీపీఐ నేతలు ఆరుట్ల రాజ్ కుమార్, జె.కుమార్, సురేందర్, సిహెచ్.శ్రీనివాస్, బైరగోని రాజు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.