Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
హేతుబద్ధత లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ లో ఇటీవల పెంచిన పీహె చ్‌డీ కోర్సు ఫీజులు పెంచ డం దారుణమని ఓయూ పీహెచ్డీ విద్యార్థులు మండి పడ్డారు. ఈ మేరకు సోమ వారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి వీసీతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని విద్యార్థులకు హామీనిచ్చారు. హేతుబద్ధత లేకుండా ఉస్మానియా యూనివర్సి టీలో పెంచిన పీహెచ్డీ కోర్స్ ఫీజులు వెంటనే తగ్గించాలని ఓయూ రీసర్చ్ స్కాలర్స్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థులు మాట్లా డుతూ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అత్యంత కఠిన నియమాలతో కూడిన పీహెచ్డీ నియామక ప్రక్రియ ఈ సంవత్సరం జరిగిందన్నారు. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన తాము అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబరిచి అడ్మిషన్లు పొందామని గుర్తు చేశారు. మూలుగుతున్న నక్కపై తాటికాయ పడ్డట్టు యూనివర్సిటీ అధికారులు పీహెచ్డీ ఫీజును పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ నిర్ణయిం చిన అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి నాలుగు రోజుల పరిమిత సమయం అనే నిబంధనను కొత్తగా తీసుకొచ్చారని తెలిపారు. పరిమిత సమయంలో ఫీజు చెల్లించకుంటే అభ్యర్థులకు ఎలాంటి సమాచారం అందించకుండానే అడ్మిషన్‌ను రద్దు చేస్తామని నిబంధనలు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ నిబంధనలకు భయపడి అప్పులు చేసి ఫీజును చెల్లించామని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రూ. 2000 ఉండే యూనివర్సిటీ పీహెచ్డీ ఫీజులను రూ.20వేలకు పెంచారన్నారు. సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, మేనేజ్మెంట్, కామర్స్, ఎడ్యుకేషన్, ఓరియెంటెల్, లాంగ్వేజెస్, విభాగాలలో సంవత్సరానికి రూ. 20,000కు పెంచారని, ఇక పీహెచ్డీ కోర్సు పూర్తయ్యే వరకు రూ.1,00,000 అవుతుందన్నారు. అలాగే సైన్సెస్, ఇంజనీరింగ్, టెక్నా లజీ విభాగాల్లో సంవత్సరానికి 25,000 రూపాయలుండగా, పీహెచ్డీ కోర్సు పూర్తయ్యే సరికి 1,25,000 రూపాయలను ట్యూషన్ ఫీజుగా నిర్ణయించారని తెలిపారు. దేశంలో ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లోకూడా ఇంతలా ఫీజులు లేవన్నారు. విద్య ఆర్థిక భారం కాకూడదనే మేము ప్రభుత్వ విశ్వవిద్యాలయా లపై మొగ్గు చూపుతున్నామని, కానీ యూనివర్సిటీ పాలక వర్గం తీసుకున్న నిర్ణయాలతో మేము ప్రభుత్వ విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో పొలిటికల్ సైన్స్ రీసెర్చ్ స్కాలర్ నెల్లి సత్య, ఫిలాసఫీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ రీసెర్చ్ స్కాలర్స్ మహేష్, కిరణ్ ఉన్నారు.