Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బీ.శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.నర్సింగరా వు, హెచ్.జీ సురేష్‌లకు క్యాష్ రివార్డుతోపాటు సర్టిఫికెట్స్‌ను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అందించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి హిల్స్ రోడ్ నెంబర్ 10లో వెంకటేష్ అనే వ్యక్తిి ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ద్విచక్రవాహనంపై వెనుక నుండిి వచ్చిన దుండగులు అతని మెడలోని 10తులాల బంగారు చైన్‌ను లాక్కెళ్లారు. అప్రమత్తమైన బాధితుడు వెంటనే డయాల్ 100కు ఫోన్ చేయడంతో డీఐ శ్రీనివాస్ తన బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుని నుంచి వివరాలు సేకరించిన డీఐ 100 మొబైల్ కారులో నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టా రు. సీసీ కెమెరాలను పరిశీలించారు. రహెమత్నగర్లో నివాసముంటూ కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రంజిత్, వెంకటగిరిలో నివాసముంటు టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న షేక్ షబీబుద్దీన్గా గుర్తించారు. కేవలం 20 నిమిషాల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలు సుకున్న హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ డీఐతోపాటు తన బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. బంజారాహిల్స్‌లో ని సీపీ కార్యాలయంలో డీఐ బీ. శ్రీనివాస్‌తోపాటు సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.నర్సింగరావు, హెచ్.జీ సురేష్‌లకు క్యాష్ రివార్డుతోపాటు సర్టిఫికెట్స్‌ను అందజేశారు. సీపీ చేతుల మీదుగా క్యాష్ రివార్డు తీసుకోవడం ఎంతో ఆనంధంగా ఉందని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.