Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
స్టీల్ బ్రిడ్జి కింద వ్యాపారస్తుల వాహనాల పార్కింగ్ కోసం అనుమతి ఇవ్వాలి అని గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినరు కుమార్ తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుంచి అశోక్ నగర్ వరకు నిర్మితం అవుతున్న స్టీల్ బ్రిడ్జి వల్ల వ్యాపారాలకు అంతరాయం ఏర్పడి, ఆర్థికంగా నష్టపోయామనీ, ప్రస్తుతం బ్రిడ్జి పనులు పూర్తి కావస్తున్న సమయంలో తమ సమస్యలను పరిష్కరించాలలని వ్యాపా రస్తుల వినతి మేరకు కార్పొరేటర్ సంబంధిత అధికారుల ను కలిసి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను సందర్శించారు. వ్యాపారస్తుల కోరిక మేరకు తప్పకుండా పార్కింగ్ స్థలం ఏర్పాటుకు కృషి చేస్తామని స్థానికులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్రీకాంత్, ఆకుల సురేందర్, సత్తిరెడ్డి, నవీన్ కుమార్, రాజేందర్, శ్రీనివాస్, స్థానిక దుకాణాల యజమానులు రమేశ్, మహవీర్ జైన్, రమేశ్ జైన్, అంజయ్య, రవి, రాములు, బద్రి, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.