Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మైనంపల్లి హనుమంతరావు
నవతెలంగాణ-దుండిగల్
ప్రజా అవసరాలకు అనుగుణంగా.. భవిష్యత్తులో జనాభా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించే దిశగా పనిచేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మైనంపల్లి హనుమంతరావు అన్నారు. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూల పల్లి చౌరస్తా నుంచి బహదూర్‌పల్లి చౌరస్తా వరకు రోడ్డు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. మంత్రి మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మెన్ సన్న శ్రీశైలం యాదవ్ హాజరై శంకుస్థాపన చేశారు. కొంపల్లి మున్సిపాలి టీ పరిధిలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రూ.25 కోట్లతో హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపడుతున్న 100 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం దూలపల్లిలో అపర్ణ పామ్ గ్రూవ్స్ సెప్టిక్ ట్యాంక్ నుంచి దూలపల్లి కల్వర్టు అశోక అలా మైసన్ వరకు రూ.2.88 కోట్లతో చేపడుతున్న ఆర్సీసీ పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ప్రతిపాదించిన 25 కోట్ల నిధులను మంత్రి కేటీఆర్ మంజూరు చేసి సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ఎన్డీపీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం సుమారు రూ.4 కోట్లతో త్వరలోనే దూలపల్లి కల్వర్టు పనిని ప్రారంభిస్తామన్నారు. అపర్ణ పామ్ గ్రూవ్స్‌లో సుమారు 10 కాలనీలు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, అందు కు శాశ్వత పరిష్కారంగా నేడు పనులను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని చెప్పారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు నెలల్లో పనులు పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నామని చెప్పా రు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి, వైస్ చైర్మెన్ గంగయ్య నాయక్, కౌన్సిలర్లు, పాక్స్ చైర్మెన్, డైరెక్టర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.