Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
బాగ్లింగంపల్లి వాటర్ వర్క్స్ కార్యాలయం పరిధిలోని అచ్చయ్య నగర్, పాలమూరు బస్తీ, ఎంఐజీ క్వార్టర్స్ తదితర ప్రాంతాలలో వేలాపాలలేని నీటి సరఫరా తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మంచి నీటి సరఫరాకు నిర్దిష్టమైన సమయాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం బాగ్లింగంపల్లి జలమండలి కార్యాలయం వద్ద స్థానికులతో కలిసి రాంనగర్ డివిజన్ కార్పొరేటర్ కె.రవి చారి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. ప్రత్యేకంగా కుటుంబంలో ఒక వ్యక్తి సమయం కేటాయిస్తే తప్ప తాగునీరు దొరికే పరిస్థితి లేదన్నారు. జలమండలి అధికారుల నిర్లక్ష్యంతో డ్రైనేజ్ మ్యాన్ హౌల్స్ పొంగిపొర్లుతున్నాయని, అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంచినీటి సరఫరా పైపులైన్లు కాలం చెల్లినవి కావడంతో నిత్యం కలుషిత నీరు సరఫరా కావడంతో స్థానికులు అనేక ఇబ్బం దులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా వాటర్ వర్క్స్ అధికారులు స్పందించి అవసరమైన చోట కొత్త పైపు లైన్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు యశోద, మహేశ్వరి, సుగుణ, రాధ, బాలయ్య, శ్రీధర్, మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.