Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
నవతెలంగాణ-బంజారాహిల్స్
సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచిం చారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని సీఐబీ క్వార్టర్స్‌లో పర్యటించిన ఎమ్మెల్యే డిసెంబర్‌లోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని జోనల్ కమిషనర్ రవికిరణ్‌ను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందు లు కలగకుండా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కా రం, ప్రజలతో ప్రత్యక్ష భేటీ కార్యక్రమంలో కార్పొరేటర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి విజయారెడ్డి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించా రు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులు వాటిని పరిష్కరించే విధంగా సత్వరం తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ డీఎంసీ మోహన్ రెడ్డి, ఈఈ ఇందిరా బారు, విద్యుత్తు, శానిటైజేషన్ శాఖల అధికారులు, రాజ్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.