Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
- షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-ఓయూ
ప్రభుత్వ పథకాలు పేదలకు వరంలా ఉంటాయని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. మంగళ వారం సితాఫలమండీలోని క్యాంపు కార్యాలయంలో రూ. 40 లక్షలకు పైగా విలువ జేసే 20 షాదీ ముబారక్, 9 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్దిదారులకు అంద చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారంగా మార కుండా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని చెప్పారు. నిరుపేద ప్రజల సంక్షే మానికి వివిధ సంక్షేమ పథకాలను అమలు జరుపుతు న్నారన్నారు. పేద ప్రజలకు వైద్య సేవలను అందించేందు కు సీఎంఆర్ఎఫ్ను సద్వినియోగం చేసుకుంటున్నా మన్నారు. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, పెన్షన్ లబ్దిదా రులు ఎవరికీ చిల్లి గవ్వ చెల్లించాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే తమ కార్యాలయం నెంబరు 040-27504448కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునిత, కంది శైలజ, నేతలు కంది నారాయణ, లింగాని శ్రీనివాస్, బీఆర్ఎస్ యువ నేత తీగుళ్ళ రామేశ్వర్ గౌడ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.