Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఎమ్మార్వోకు సీపీఐ(ఎం) నాయకుల వినతి
నవతెలంగాణ-జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీల్లో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదలకు వెంటనే జీవో 58 కింద పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) నాయకులు కోరారు. జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖైరతాబాద్ ఎమ్మార్వోకు వినతి పత్రం ఇచ్చారు. జీవో 58 కింద ఈ నెల 16 నుంచి 30 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిందని, దీనిని మే నెల మొత్తం పొడిగించాల్సిందిగా కోరారు. ఈ నెలలో ప్రభుత్వ సెలవులు ఎక్కువగా ఉన్నందున అప్లికేషన్ పెట్టుకోవడానికి గడువు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంతకుముందు అప్లికేషన్ పెట్టుకున్న వారికి, మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోకుండా పాత అప్లికేషన్లనే ఓకే చేసి సర్వే చేయాలని సూచించారు. స్థలం ఉండి రేకుల ఇల్లు ఉన్న వారందరికీ రూ.3లక్షల స్కీం కింద దరఖాస్తులు తీసుకోవాలని కోరారు. ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు రాపర్తి అశోక్, టి.సాయి శేషగిరిరావు, జి.స్వామి, జి.కిరణ్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.