Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల ని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం నల్లకుంట డివిజన్లోని స్ట్రీట్ నంబర్ 7లో రూ.49 లక్షలతో నూతనంగా వేయనున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే నల్లకుంట కార్పొరేటర్ అమృతతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో పాదయాత్ర నిర్వహించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. అక్కడ చెపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.