Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేకపోతే మరో ఉద్యమానికి సిద్ధమవుతాం
- తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి చైర్మెన్ ఆర్.విజయ్
నవతెలంగాణ-ముషీరాబాద్
ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలు, పే స్కేలు అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ల హామీలను అమలు చేయాలని తెలంగాణ వీఆర్ఏ కుల సాధన సమితి చైర్మెన్ విజయ్ డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని విస్మరించా రని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని 80 రోజులు సమ్మె చేశా మని, సుమారు 80 మంది వీఆర్ఏలను కోల్పోయామని, అయినా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. మునుగోడు ఎన్నికలు అవ్వగానే మీ సమస్యలకు సంబంధించిన జీవో లు విడుదల చేస్తామని హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేశారన్నారు. సమ్మెను విరమించి సుమారు 6 నెలలు గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోలేద న్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే వీఆర్ ఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని యెడల రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర చేసి వీఆర్ఏలను ఏకం చేస్తామని, జీవోలు విడుదల అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జాబ్ చార్ట్ ప్రకారం పార్ట్ టైం ఉద్యోగం కాబట్టి గ్రామాల్లోనే పనిచేస్తామని, అదనపు పనులు చెయ్యబోమని తెలిపారు. ఎన్నికల విధులను బహి ష్కరిస్తామని చెప్పారు. అవసరమైతే ఇందిరా పార్క్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వీఆర్ఏ హక్కుల సాధన సమితి ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్‌గౌడ్, కో చైర్మెన్లు లక్ష్మల్ల నరసింహారావు, దాసరి వీరన్న, షర్మిల, రాజయ్య, చల్ల లింగరాజు, కన్వీనర్లు నార్ల శ్రీనివాస్ ముదిరాజ్, సునీత, కోకన్వీనర్లు ఆరుట్ల బాలయ్య, ఎడ్ల మల్లయ్య, అశోక్, వివిధ జిల్లాల వీఆర్ఏలు పాల్గొన్నారు.