Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలనీ, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29వ తేదీన లేబర్ కమిషనర్ ఆఫీస్ ఎదుట సీఐటీ యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు సీఐటీయూ గోషామహల్ జోన్ కన్వీనర్ కె.జంగయ్య, బేగంబజార్ ట్రాన్స్పోర్ట్ హమాలీ వర్కర్స్ యూనియన్ ( సీఐటీయూ) అధ్యక్ష, కార్యదర్శులు జి.నర్సింహ్మ, జి.ఆనంద్ తెలిపారు. మంగళవారం ధర్నా పోస్టర్‌ను హమాలీ కార్మికులతో కలిసి కిషన్ గంజ్ సీఐటీయూ ఆఫీస్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల మాదిరిగానే హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి చట్టబద్ధ సౌక ర్యాలు కల్పించాలని కోరారు. 55 ఏండ్ల వయస్సు పై బడిన వారికి నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలలనీ, గుర్తిం పు కార్డులు, ప్రమాద బీమా, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిం చాలనీ, పని ప్రదేశాల్లో హమాలీల కోసం టాయిలెట్స్, విశ్రాంత గదులు ఏర్పాటు చేయాలనీ, హమాలీ కార్మికు లకు డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హమాలీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాలో అధిక సం ఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని హమాలీ కార్మికుల కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.కుర్మయ్య, కె. అంజప్ప, జె.బసంతు, జి.వెంకటేష్, జి.తిరుపతి, పి.తా యప్ప, భీమప్ప, నర్సింహ్మ, కె.ఆశప్ప, దేవప్ప, అశోక్, శర ణ్, టి.రాజు, అంజప్ప, శ్రీను, క్రిష్ణ పాల్గొన్నారు.