Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖైరతాబాద్ ఆఫీస్, నాగోల్ ట్రాక్‌ను పరిశీలించిన బీహార్ ఎంవీఐ బృందం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో రవాణాశాఖ సేవలు అబ్బురపరిచేలా ఉన్నాయని బీహార్ రాష్ట్ర రవాణాశాఖకు చెందిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ (ఎంవీఐల) బృందం అభిప్రాయప డింది. రాష్ట్ర పర్యటనలో ఉన్న 58 ఎంవీఐలతో కూడిన బీహార్ బృందం మంగళవారం ఖైరతాబాద్‌లో రాష్ట్ర రవా ణాశాఖ కమిషనర్, ఆర్టీవో కార్యాలయాన్ని సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రవాణారంగంలో ప్రజలకు పారదర్శక మైన సేవలను అందిస్తుందని ఖైరతాబాద్ ఆర్టీవో ఎల్. రాంచందర్ అధికారులకు వివరించారు. దాదాపు 18 పౌర సేవలు రవాణాశాఖ ఆన్లైన్లో అందిస్తుందని తెలిపారు. ఎంవీఐలు శ్రీనుబాబు, రాజు, టెక్నికల్ హెడ్ మధుసూదన్ బీహర్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాల గురించి వివరించారు. అనంతరం అధికారు లు కార్యాలయంలో పర్యటించి పౌరులకు క్యాష్‌లెస్ రూపంలో అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. విప్లవాత్మకంగా అమలవుతున్న ఐటీ సేవలను వారు ప్రశంసించారు.
డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్స్, ఫిట్నెస్ పరీక్షల పరిశీలన
నాగోల్ టెస్టింగ్ ట్రాక్స్ విభాగాన్ని సందర్శించారు. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ జారీ అమలవుతున్న పరీక్షా విధానా లను ప్రత్యక్షంగా వీక్షించి తెలుసుకున్నారు. రాష్ట్రంలో లైసెన్స్ జారీకి ఖచ్చితమైన విధానాలు అమలులో ఉన్నా యనీ, ఈ సందర్భంగా నాగోల్ డ్రైవింగ్ ట్రాక్ ఆర్టీవో సురేష్‌రెడ్డి వివరించారు. ఇక్కడ వివిధ లైసెన్స్‌ల జారీకి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. నాగో ల్లో వాహన ఫిట్నెస్ జారీ ప్రక్రియ గురించి ఆడిగి తెలు సుకున్నారు. ఎంవీఐ ఉమా బీహర్ అధికారులకు ఆయా అంశాలను గురించి వివరించారు. డాక్టర్ ఎంసీఆర్ హెచ్ ఆర్డీ సంస్థ సౌజన్యంతో అధికారులు రాష్ట్రంలో పర్యటిస్తు న్నారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ పెదబో యిన శ్రీనివాస్, శ్రీనివాస్ వడ్ల వ్యవహరించారు.