Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో/ఓయూ
తార్నాక డివిజన్ విజయ డైరీ, చింతల్లోని పౌరసరఫరాల డీలర్ షాపులను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ దుకాణాల్లో బియ్యం సక్రమంగా సరఫరా జరుగుతుందా లేదా అనే విషయంతోపాటు తూకంలో ఎలాంటి హెచ్చు తగ్గులు లేకుండా లబ్ధిదారులకు సరుకులు అందుతున్నా యా అన్న విషయాన్ని పరిశీలించారు. లబ్దిదారుల పట్ల డీలర్ పనితీరు ఎలా ఉందిని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందించే ఉచిత బియ్యాన్ని అవకతవకలు లేకుండా లబ్దిదారులకు అందించాలనీ, ఎలాంటి అక్రమాలకు పాలుపడొద్దంటూ డీలర్లను హెచ్చరి ంచారు. ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు రావాల్సిందిగా లబ్దిదారులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్వో సరస్వతి, సర్కిల్ 9 ఇన్స్పెక్టర్లు లోకేష్, ఉత్తేజ్, కిరణ్, యూ.వీ.ఆర్.ఎస్. సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.