Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈ.టి. నరసింహ
నవతెలంగాణ-అంబర్పేట
బీజేపీ, ఎంఐఎం పార్టీల మతపరమైన రాజకీయాలు దేశ సమగ్రతకు ప్రమాదకరంగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఈ.టి. నరసింహ ఆందోళన వ్యక్తం చేసారు. రాజకీయాల్లో మతం పాత్ర కొనసాగితే దేశంలో అనిశ్చిత్తి, అశాంతి తోపాటు వృద్ధిలో తీవ్ర మందగమనం, సంపద నష్టం జరుగుతుందన్నారు. విభజించి పాలించే నీచమైన విధానాలు పాటిస్తూ శాంతి యుత సహజీవనంలోఉన్న ప్రజల మతపరమైన మనోభా వాలను దెబ్బతీయడనికి పాల్పడే పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ ఫాసిస్ట్ ప్రజా వ్యతరేక విధానాలను 'బీజేపీ హటావ్-దేశ్ బచావ్' నినాదంతో ప్రజలకు తెలి పేందుకు ఇంటింటికీ సీపీఐ కార్యక్రమం మంగళవారం అంబర్పేట నియోజకవర్గంలోని పలు బస్తీల్లో, కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందల మంది సీపీఐ శ్రేణులు ఎర్ర జెండాలు చేతబూని ప్రదర్శనగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ మోడీ ప్రభుత్వం దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో ప్రజలకు వివరించి, వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని కోరారు. మోడీ ప్రభుత్వ పాలనా పనితీరు అధ్వాన్నంగా మారిందన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం చాలా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభించి ఎనిమిదేండ్లలో 23 కోట్ల మందిని దారిద్య్రరేఖకు దిగువకు నెట్టిందన్నారు. తిండి దొరక్క పేద ప్రజలు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని తెలిపారు. ఉపాధి కల్పన విషయంలో మోడీ ప్రభుత్వం విఫలమైందనీ, నిత్యావసర వస్తువుల ధరలు, డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల దేశ ప్రజలు విపరీతమైన బాధను అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మతతత్వ, వినాశకరమైన విధానాలు అవలంభిస్తు న్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడిం చాలని విజ్ఞప్తి చేశారు. సీపీఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఎస్.ఛాయాదేవి మాట్లాడుతూ బీజేపీ, ఎంఐఎం పార్టీలు మత ఉద్రిక్తతలు సృష్టించడం వల్ల హైదరాబాద్ నగరంలో ఆశించినంత అభివృద్ధి జరగడంలేదన్నారు. పెద్దపెద్ద అభివృద్ధి పథకాల అమలుకు బీజేపీ, ఎంఐఎం పార్టీలు అడ్డుపడుతున్నాయన్నారు. ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు, ఏఐటీ యూసీ రాష్ట్ర కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ కార్మి కుల సంక్షేమం కోసం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి బీజేపీ ప్రభుత్వం బదులుగా నాలుగు కోడ్లను తీసుకవచ్చి కార్మికుల బతుకులను రోడ్డు పలు చేసిందన్నారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతరేక విధానాలను నిరసిస్తూ పోరాటాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సీపీఐ హైదరాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, కార్యవర్గ సభ్యులు ఆర్.మల్లేష్, తెలం గాణ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్య క్షులు బైరగోని రాజు గౌడ్, సీపీఐ నాయకులు కృష్ణగౌడ్, రాజు గౌడ్, లతీఫ్, జె.కుమార్, భూపాల్, రాజు, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.