Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక
నవతెలంగాణ-ముషీరాబాద్
జీవో 58 కింద ఇండ్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసు కునే గడువును పొడిగించాలని తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక డిమాండ్ చేసింది. మంగళవారం గోల్కొండ క్రాస్ రోడ్డులోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ప్రజాసంఘాల నాయకులు జె. కుమారస్వామి మాట్లాడు తూ ప్రభుత్వ సీలింగ్ భూముల్లో నివసిస్తూ ఇండ్ల పట్టాలు లేని పేదలకు జీవో 58 కింద ఉచితంగా క్రమబద్ధకరించుకునేందుకు ప్రభుత్వం ఈ నలె 30వ తేదీ వరకు అవకాశం కల్పించిందన్నారు. కానీ నగరంలో క్రమబద్ధీకరణ చేసుకునే వేలాదిమంది ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన సమయం సరిపోదన్నారు. దీన్ని మే 31 వరకు పొడగించాలని కోరారు. ఎన్.మారన్న మాట్లాడుతూ 125 గజాల లోపు స్థలం కలిగి 2020 జూన్ 2 నాటికి ఆ ఇంట్లో నివసిస్తున్నట్టు ఏదైనా ఒక ఆధారం (రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, కరెంట్ బిల్, వాట ర్ బిల్ ఆస్తిపన్ను రసీదు, నిర్మాణ అనుమతి) స్థలం స్వాధీనంలో ఉన్నట్టు సూచించే ఇతర డాక్యుమెంట్లు కలిగి ఉండాలన్నారు. దీనికి తోడు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే ఉచితంగా ఇంటి పట్టా పొందేందుకు 2023 ఏప్రిల్ 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చనీ, 125 గజాలకు మించి ఉంటే కొంత రుసుం చెల్లించి జీవో 59 కింద క్రమబద్ధీకరిం చుకోవచ్చని తెలిపారు. గతంలో కూడా ఇంటి పట్టాల కోసం దరఖాస్తు చేసుకు న్నప్పటికీ కుంటి సాకులతో అధికారులు తిరస్కరించారన్నారు. సొంత జాగా ఉంటే ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల ఆర్థిక సహకారం అంది స్తానని ప్రకటించిందని.. దాన్ని హైదరా బాద్ నగరంలో ఐదు లక్షలకు పెంచి ఇండ్ల పట్టా ఉన్నా లేకపో యినా ప్రతి పేద కుటుంబానికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పట్టా ల కోసం దళారుల మాటలు నమ్మి మోసపోద్దనీ, తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక పేదలకు సహకారంగా ఉంటుందని తెలి పారు. ఈ సమావేశంలో ఎ.పద్మ, ఎండీ జావేద్ పాల్గొన్నారు.