Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి
- రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-బడంగ్పేట్
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు మౌలిక సదుపా యాలు కల్పించేందుకు ఎంతో కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మామిడిపల్లి గ్రామం నుండి శంషాబాద్‌కు వెళ్లే నాలుగు రోడ్ల రహదారి విస్తరణ పనులు, రూ.29.50 కోట్లు నిధులతో చేపట్టిన అభివద్ధి పనులకు ప్రభుత్వం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఈ రహదారి విస్తరణ వలన విమానాశ్రయానికి అనుసంధానంగా ఉంటూ ప్రజల, రహదారుల రాకపోకలు సులభవుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇప్పటికే మహేశ్వరం నియోజకవర్గంలో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రతినిదులు, అధికారులు పనిచేస్తున్నారని మంత్రి పేర్కన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మల నరేంద్ర గౌడ్, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు చుక్కా శివకుమార్, యాతం పవన్ యాదవ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కష్ణ మోహన్ రెడ్డి, డిఈఈ జ్యోతి, స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదింటి ఆడబిడ్డలకు అందించే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం చిరు కానుక లాంటిదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపాలిటీలో షాది ముబారక్, కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఐదు కోట్ల 39 లక్షల 62వేల 524 రూపాయల చెక్కులను మరాఠా భవన్లో లబ్దిదారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వార బాలాపూర్ మండలంలో రూ.59 కోట్ల 53 లక్షల 13వేల 600 అందచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జల్ పల్లి మున్సిపాలిటీ పరిధిలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ద్వార లబ్ధిదారులకు ఒకే రోజున షాదీ ముబారక్ 522, కళ్యాణ లక్ష్మి17 మొత్తం 539 చెక్కులను అందించామని వివరించారు. ఇంత గొప్ప పథకాలను రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ ప్రతి పేదింటి ఆడబిడ్డకు మేనమామలా అదుకుంటున్నారని తెలిపారు. ఆపదలో ఆదుకున్న సీఎం కేసీఆర్‌ను మర్చిపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా బిన్ సాది, వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, కందుకూర్ ఆర్డిఓ, బాలాపూర్ మండల తహశీల్దార జనార్దన్ రావు, జల్ పల్లి మున్సిపాలిటీ కమిషనర్ వసంత, కౌన్సిలర్లు బీ..యాదగిరి, కే.లక్ష్మి నారాయణ, శంకర్, పమిద అప్జల్, కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కష్ణారెడ్డి, అనుబంధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎక్బాల్ ఖలీఫా, మహిళా నాయకురాలు, అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.