Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఘట్కేసర్
దౌర్జన్యంగా ప్లాట్లు కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేస్తున్న రియల్ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ చౌదరి గుడా గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు కొంగరి శంకర్, కొర్రెముల మాజీ ఉపసర్పంచ్, పల్లె బాబురావుగౌడ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చౌదరిగూడ గ్రామంలోని సర్వే నెంబర్ 714లో 1972లో గ్రామపంచాయతీ లేఔట్ చేశారని, కానీ, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు 2000లో నకిలీ డాక్యుమెంట్ తయారు చేసి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని చెప్పారు. గతంలో ఉన్న లేఅవుట్ ప్రకారం.. అందులో వార్డు సభ్యుడు కొంగరి శంకర్, కొర్రెముల మాజీ ఉపసర్పంచ్, పల్లె బాబురావు 714 సర్వే నెంబర్లో 1600 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. కానీ, ఆ స్థలాలకు కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్న వారిని ప్రశ్నిస్తే.. మీ భూమి మీకు ఇస్తామంటున్నారని చెప్పారు. కానీ ప్లాట్ల యజమానులకు తెలియకుండా కబ్జా చేసి ఇండ్లు నిర్మిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.