Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నాగోల్
మంగళవారం హైదరాబాద్‌లోని సుభాష్ చంద్ర బోస్ నగర్, న్యూ హఫీజ్‌పేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంను రాష్ట్ర పర్యాటక అభివద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాసులు గుప్త సతీసమ్మేతంగా సందర్శించి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం మకరతోరణంకు కిలో వెండి విరాళంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త దంపతులు అందజేశారు. ఈ సందర్భంగా దేవాలయానికి విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్-స్వప్న దంపతులకు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమీటీ సభ్యులు, పండితులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామూహిక అర్చనతో పాటు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ట్రస్ట్ చైర్మన్, సభ్యులు కలిసి స్వామి వారి కండువాలతో, సత్కరించారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ శ్రీ అభయాంజనేయ స్వామి వారి దర్శనం కోసం, వారి ఆశీస్సులు పొందడం కోసం కుటుంబంతో కలిసి వచ్చామని తెలిపారు. స్వామి వారికి అభిషేకం, అర్చన చేయడం జరిగిందన్నారు. అందరితోపాటు మా కుటుంబాన్ని కూడా చల్లగా చూడాలని, స్వామి వారికి కిలో వెండి విరాళంగా అందజేయడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషా లతో వంద సంవత్సరాలు జీవించాలని రాష్ట్ర ప్రజలు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం తోపాటు రైతులు పాడి పంటలతో విలసిల్లాలని, దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా వుండాలని, అందర్నీ దీవించాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ఉప్పల స్వప్న, కుమారులుతోపాటు దేవాలయం చైర్మన్, గంప సత్యనారాయణ గుప్త, టెంపుల్ డైరెక్టర్స్ రామకష్ణ, యాదగిరి, రవీందర్, ప్రభు, రాములు, నటరాజ్, దేవాలయ కమిటీ సభ్యులు, పండితులు, భక్తులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.