Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్
నవతెలంగాణ- వనస్థలిపురం
కాలనీలో పార్కు స్థలాలు కబ్జాకు గురికాకుండా కాలనీ సంక్షేమ సంఘం నాయకులు పరిరక్షించుకోవాలని హయ త్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ అన్నారు. బీఎన్‌రెడ్డి డివిజన్ గాయత్రినగర్ ఫేస్-4లో పార్కు స్థలాన్ని ఆయన మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. గతంలో గాయత్రి నగర్ ఫేస్ ఫోర్ కాలనీ లేఅవు ట్లో పార్కు అభివృద్ధి కోసం 1600 గజాల స్థలాన్ని కేటాయించారని కాలనీ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా డీసీ మాట్లాడుతూ.. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పార్కు స్థలాలకు ఫెన్సింగ్ వేయించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ పార్కు స్థలానికి సంబంధించిన లేఔట్ పత్రాలను ఇస్తే త్వరలోనే పార్కు ప్రహరీ నిర్మాణం పనులు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి.యన్.రెడ్డి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, టీపీఎస్ ఉమాదేవి, గాయత్రి నగర్ కాలనీ పేస్ ఫోర్ అధ్యక్షుడు మనోజ్ కుమార్, కాలనీ సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.