Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
వీధి కుక్కల నివారణ కోసం అధికారులు ప్రజల సహకారంతో అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి అన్నారు. బుధవారం చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్, వెటర్నరీ హై లెవెల్ కమిటీ మెంబర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ రాఘవేంద్ర నగర్ కాలనీలో కుక్కలకు, ఇతర జంతువులకు నీటి కోసం తొట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, కార్పొరేటర్ మాట్లా డుతూ.. వేసవికాలంలో కుక్కలకు, ఇతర జంతువులకు తాగడానికి నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నీళ్ల తొట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా వారి వారి ఇంటి ముందర జంతువుల కొరకు తొట్లను ఏర్పాటు చేయా లని కోరారు. కార్యక్రమంలో కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ఎద్దుల కొండల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పల్లె నర్సింగ్‌రావు, ప్రధాన కార్యదర్శి కోకొండ జగన్, పండ్ల కిషన్, రామానుజన్, అశోక్ చారి, అబ్బో భారు, మహమూద్, బాలు, బ్యాలెండర, శైనాజ్, రోసి రెడ్డి, రామకృష్ణ, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.