Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
చదువుకుని వద్ధిలోకి రావలసిన నలుగురు మైనర్లు జల్సాల కు అలవాటు పడి ద్విచక్ర వాహనాలు చోరీలకు పాల్పడుతూ పోలీసులకు అడ్డంగా దొరికిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ జలంధర్ రెడ్డి పర్యవేక్షణలో డిటెక్టివ్ సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్కేడీ నగర్ మంగావత బాలకష్ణ తన ఇంటి ముందు టీఎస్ 07 జే డబ్ల్యు 7837 నెంబర్ గల స్పెండర్ ప్లస్ పార్కు చేయగా గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు భాగంగా వనస్థలిపురం సుష్మా చౌరస్తాలో వాహ నాలు తనిఖీలు చేస్తుండగా ఆ స్ప్లెండర్ ప్లస్ పై బాలురు వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించమనడంతో పారిపోవ డానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ మేరకు వనస్థలిపురం కమలా నగర్,శ్రీ సాయి నగర్, ఎస్ ఎఫ్ కాలనీలలో మూడు వాహనాలు దొంగిలించినట్లు బాలురు ఒప్పుకున్నారు. ఆ వాహనాల తర్వాత అమ్ముదాం అన్న ఉద్దేశంతో ఇంటి దగ్గరే ఉంచినట్లు ఆ మైనర్లు పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఆ మైనర్లపై కేసు నమోదు చేసి వారిని జువెనాల్ హౌమ్ కి తరలించి వారి వద్ద నుంచి మరో మూడు వాహనాలు టీఎస్ 16 ఈ ఎల్3448 నెంబర్ గల గ్లామర్, టీఎస్ 09 ఇవి 4412 నెంబర్ గల హెచ్ ఎఫ్ డీలక్స్ బైక్, టీఎస్ 08 ఈ ఎఫ్ 9592 నెంబర్ గల స్ప్లెండర్ ప్లస్ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.