Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సంతోష్‌నగర్
ఒక్క పూట బడులను నిర్వహించకుండా, ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న నారాయణ, భాష్యం స్కూళ్లకు మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య ఆదేశాల మేరకు సీఆర్పీ రమేష్ నోటీసులు ఇచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మెట్టల చైతన్య యాదవ్, పి.శివకుమార్ మాట్లాడుతూ.. నిబంధనలను వ్యతిరేకంగా నడుపుతున్న దిల్సుఖ్నగర్ నారాయణ, భాష్యం కార్పొరేట్ స్కూళ్లను సీజ్ చేయాలని డిమాండ్ చేశా రు. అంతేకా కుండా అకడమిక్ సంవత్సరం ప్రారంభం కాక ముందే 9వ తరగతి విద్యార్థులకు పదో తరగతి సిలబస్ చెబుతూ విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్నార న్నారు. స్పెషల్ క్లాసులు, పండుగల పేరు మీద పెద్దఎత్తున ఫీజులు వసూ లు చేస్తున్నారని, ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్యకు ఫిర్యాదు చేసిన వెంటనే వారు సీఆర్పీ రమేష్‌కి పంపించి దిల్సుఖ్నగర్ నారాయణ, భాష్యం స్కూళ్లకు నోటీసులు ఇచ్చారన్నారు. అయితే, ఇది పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ మొహమ్మద్, ఏఐఎస్ఎఫ్ నాయకులు కార్తీక్ వంశీ తదితరులు పాల్గొన్నారు.