Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. భగభగ మండతూ జనాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాడు వేడిగాలులు , ఉక్కపోతలతో జనాలు విలవిలాడుతున్నారు.రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. పగటిపూట రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం తొమ్మిది దాటిం దంటే ప్రజ లు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పాడుతోంది . జిల్లా లో రోజు రోజుకు ఉషో ్ణగ్రత్త డిగ్రీలు పెరిగిపోతున్నాయి. ఎండల భయానికి ఉదయం, సాయం త్రం వేళ్లలోనే ప్రజలు తమ పనులను ముగించుకుంటున్నారు.
నిప్పుల కుంపటిలా మేడ్చల్ జిల్లా
మేడ్చల్ జిల్లా నిప్పుల కుంపటిలా మారుతున్నది.రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత్తలు ఎండ వేడిమికి,వేడి గాలులకు ప్రజలు అవస్థలు ఎదుర్కోంటున్నారు.మేడ్చల్ జిల్లా పరిధిలో సగటు ఉష్ణోగ్రత్తలు 39 డిగ్రీలుగా నమెదవుతున్నట్టు అధికారుల రికార్డులు చెబుతున్నాయి.ఈ సంవత్సరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండుతున్నాయి. మే నెలలో ఉండాల్సిన ఎండవేడిమి ఇప్పుడే కనిపిస్తోంది.రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రత్తలు పెరిగే పరిస్థితి ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పనులన్ని ఉదయం 10 గంటల లోపే
మండుతున్న ఎండలకు ప్రజలు తమ పనులను ఉదయం 10 గంటల లోపే చేసుకుంటున్నారు. కార్యాలయాలకు వెళ్లేవారు మాత్రం 9 గంటలలోపే చేరుకుంటున్నారు. ఉపాధి ,వ్యవసాయ ,అడ్డాకూలీలు తమ పనులను ఉదయం పది గంటల లోపే పూర్తి చేసుకుని నీడ పట్టుకు చేరుతున్నారు. మధ్యాహ్నం వాహనాలు రాకపోకలు నిలిచిపోతుండటంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారు తున్నాయి. చేతి గోడగు లేకుండా మహిళలు ,వృద్దులు ,యువకులు బయటకు రావడం లేదు.ద్వీచక్ర వాహనదారులు హెల్మెట్లు ,టోపి లు ధరించి ప్రయాణం చేస్తున్నారు.ఎండలకు భయపడి ప్రజలు ఆర్టీసి బస్సుల్లో సైతం ప్రయాణం చేయడం లేదు.సాయంత్రం 5 దాటితే కానీ ప్రజలు వారి అవసరాల పనుల నిమిత్తం బయటకు రాలేని పరిస్దితి ఏర్పాడుతోంది.
ఉపాధి పనులపై ప్రభావం
పెరుగుతున్న ఎండల ప్రభావం వ్యవసాయ ,ఉపాధి పనులపై తీవ్రంగా పడుతోంది.ఏప్రిల్ ,మే నెలలో యాసంగి పంటలు చేతికో స్తాయి. ఈ సమయంలోనే వరి కోతలు ఉపందుకుం టున్నాయి.పెరుగుతున్న ఎండలు వరి కోతలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎండల దెబ్బకు భయపడి కూలీలు వ్యవసాయ పనులకు రావడం లేదు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు అలోచిస్తూ యంత్రాలతో పనులు కానిస్తున్నారు.మరికొందరు కూలీలు తెల్లవారు జామున 5 గంటలకే వ్యవసాయ పనులు చేస్తూ ఉదయం 10 గంటల వరకు ఇండ్లకు చేరుతున్నారు.ఉపాధి పనులపైన తీవ్ర ప్రభావమే పడుతుంది.భానుడి ప్రతాపానికి ఉపాధి కూలీలు ఉదయం వేళల్లోనే పనులకు వెళ్తున్నారు.సూర్యుడి ప్రతాపానికి అన్ని వర్గాల జనాలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రత్యామ్నాయం వైపు జనం చూపు..
సూర్యుడు మండిపోతుండటంతో ప్రజలు విలవిల్లాడు తున్నారు. దీంతో ప్రజలు ఎండవేడి నుంచి ఉపశమనం పోందేం దుకు రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుం టున్నారు.ప్రీజ్ ,కూలర్ ,ఎసీల కోనుగోళ్లు మార్కెట్లో పెరిగిపో తున్నాయి.అత్యవసర సమయంలో బయటకు రావాల్సి వస్తేనే బయటకు వెళ్తున్నారు.వాహనాల పై వెళ్లే వారైన నడుచుకుంటూ వెళ్లేవారైనా స్కార్ఫ్లు, కర్చీఫ్లు కట్టుకుంటూ జాగ్రత్తలు తీసుకుం టున్నారు.వేడి గాలులు ,వడగాలులు తగలకుండా మోహలకు రుమాళ్లను చుట్టుకుని రక్షణ పోందుతున్నారు .మరోపక్క ప్రజలు చల్లని పానియాలపై ఆసక్తి కనబరిస్తూన్నారు.పండ్ల రసాలు ,మజ్జీగ ,కూల్డ్రింక్స్ తీసుకుంటూ ఎండ వేడిమి నుంచి ఉపశమనం పోందుతున్నారు.