Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడ్మెట్
ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే సీపీఐ ముందున్న లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్.బాల మల్లేష్ అన్నారు. ఈ నెల 24 నుంచి మే 5 వ తేదీ వరకు మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఇంటి, ఇంటికి సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తూ ''బీజేపీ హటావో దేశ్ కు బచావో'' నినాదంతో ప్రజా పోరు యాత్రను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. మంగళవారం యాప్రాల్ లో తోటపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు అమ్ముడు పోయి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి,ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని మండిపడ్డారు. మన దేశంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి రైతాంగ ఆత్మహ త్యలకు దారితీసిందని విమర్శించారు. దేశం మతోన్మాదం పెంచి పోషిస్తూ లౌకిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోం దన్నారు. మేడ్చల్ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలు గౌడ్ మాట్లాడుతూ...ఏప్రిల్ 24 నుంచి 29 వరకు మేడ్చల్ నియోజకవర్గంలోనూ ,అదే విధంగా మల్కాజిగిరి నియోజక వర్గంలో ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు ఇంటింటికి సీపీఐ పాదయాత్రలు నిర్వహిస్తు న్నామని తెలిపారు. పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రొయ్యల కృష్ణమూర్తి, తోటపల్లి శంకర్, జె. లక్ష్మి, మల్కాజిగిరి మండల కార్యదర్శి టి. యాదయ్య గౌడ్, ఆల్వాల్ మండల కార్యదర్శి కె. సహ దేవ్, కాప్రా మండల కార్యదర్శి డి. యాదగిరి, చంద్రయ్య, మహిళా నాయకురాలు ప్రమీల, మాధవి, రాజేశ్వరి, స్వరూప, సంతోషి, జంగయ్య, వెంకట రమణ, యాదగిరి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.