Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
తెలంగాణ ప్రజా సాంస్కతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో సమతా పక్షోత్సవాలలో భాగంగా కాప్రా గాంధీ నగర్ కమ్యూనిటీ హాల్లో ''మనువాదాన్ని తిప్పికొ డదాం.. భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం!'' అంశంపై సదస్సు జరిగింది. సమాచార హక్కు నాయకులు గగన్ కుమార్ ఆహ్వానితులను వేదిక మీదకు ఆహ్వానించారు. సదస్సుకు కాప్రా గాంధీ నగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ప్రారంభ సూచికగా స్ఫూర్తి గ్రూప్ బాధ్యులు రుక్కయ్య ముందుగా కాప్రా గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేష్ స్ఫూర్తి కలిగిస్తున్న నాయకులకు ఆహ్వానం పలికారు. సదస్సులో ముఖ్య వక్తలుగా ప్రసాద్ బాబు, సీహెచ్ నాగేశ్వరావు మాట్లాడారు. అలాగే గాంధీనగర్ యువజన సంఘం కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడారు. ముం దుగా అఖిలభారత ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ నాగేశ్వరరావు మాట్లాడుతూ మనువాదం భారతీయ సమాజాన్ని అతి హీనంగా రూపొందిం చిందన్నారు. దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ తన వంతు కృషి చేస్తూ గట్టిగా పోరాడారని చెప్పారు. నేటి పాలకులు రాజ్యాంగానికి తూట్లు పొడిచి మనువాదాన్ని తిరిగి పున్ణ ప్రతిష్టించడానికి ప్రయత్నిస్తున్నారని దానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రముఖ సామాజిక ఉద్యమ నాయకులు ప్రసాద్ బాబు మాట్లాడుతూ మనువాదం భారతదేశానికి పట్టిన క్యాన్సర్ వంటిదన్నారు. భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసే ప్రయత్నంగా ప్రభుత్వ రంగాన్ని నాశనం చేస్తున్నారని తెలిపారు. సామాజిక ఉద్యమ నాయకులు కోమటి రవి , ప్రముఖ విద్యావేత్త మల్లేశ్ , గగన్ కుమార్ స్ఫూర్తిగా బాధ్యులు గొడుగు యాదగిరిరావు మాట్లాడారు. రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నాయకులు భాస్కర్ అభ్యుదయ గీతాలతో అలరించారు. గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్. యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అతిథులకు శాలువాలతో సత్కరించారు. గగన్ కుమార్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది. శ్రీమన్నారాయణ, వెంకట్, నాగయ్య, పి.బి చారి, లోకాభిరామ్, ఎన్పిఆర్ డి వెంకటేష్,సోమయాచారి, రాజమల్లు, ప్రభాకర్, రాజు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.