Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని, 2024 సంవత్సరంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం కీసర మండలం చిర్యాల గ్రామంలోని ఎంఎల్ఎన్ కన్వెన్ష న్లో బీఆర్ఎస్ కీసర మండల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలాల్ పురం సుధాకర్ రెడ్డి అధ్యక్షత జరిగిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడారు.స్వరాష్ట్రం సాధించిన నాటి నుండి అన్ని రంగాల్లో పురోగతి సాధించి ఆదర్శవంతమైన రాష్ట్రం గా తెలంగాణ రూపుదిద్దుకుందని అన్నారు. కేవలం మతా న్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందన్నారు. తెలంగాణలో అమలు చేసే పథకాలు దేశంలో ఎక్కడా లేవని, దమ్ముంటే బీజేపి పాలితరాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపించాలన్నారు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన మోడీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఈడీ, ఐటీ దాడులు చేస్తూ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రాబోయే రోజుల్లో పార్లమెంట్ సీట్లలో పోటీచేసి గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. నియోజకవర్గంలో రాబో యే రోజుల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం జరుగు తుందని, అందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించే విధంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు. అభివద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలన్నారు. అభివృద్ధి, సంక్షే మంలో దూసుకుపోతున్న మేడ్చల్ నియోజకవర్గంలో మూ డో సారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఉద్యమ కారులకు.. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ తగిన గుర్తింపునిస్తుందని పేర్కొన్నారు. జిల్లాపరిషత్ చైర్మెన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి , బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార ్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి రాజశేఖరరెడ్డి, పార్టీ రాష్ట్ర యువనాయకులు భద్ర రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మెన్ బెస్త వెంక టేష్,ఎంపీపీ ఇందిరా లక్ష్మి నారాయణ, వైస్ ఎంపీపీ సతి ్తరెడ్డి ,మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు వం గటి పర్వత్ రెడ్డి, చీర్యాల సర్పంచ్ ధర్మేందర్ ,మాజీ సర్పంచ్ పులాగుర్ల లావణ్య శ్రీనివాస్, మాజీ ఎంపిటిసి రాము, శివాలింగల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.