Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల పురోగతిపై ఆయా నియోజక వర్గాల వారీగా ప్రగతి నివేదికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ అమోరు కుమార్ అన్నారు. బుధవారం శామీర్ పేటలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యనాయక్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సీపీఓ మోహన్ రావు, జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రగతి నివేదికల తయారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2014-2015 సంవ త్సరం నుంచి 2022-2023 సంవత్సరం వరకు ఆయా ఆర్థిక సంవత్సరాలలో నియోజకవర్గాల వారీగా చేపట్టిన సంక్షేమ అభివద్ధి కార్యక్రమాలపై నివేదిక రూపొందిం చాలని, అదే విధంగా అప్పట్లో జరిగిన పనులు, ప్రస్తుతం జరిగిన పనులకు సంబంధిత శాఖల అధికారులు అభివృద్ధి పనుల ఫొటోలతో కూడిన నివేదికలో మేడ్చల్ నియాజ కవర్గానికి సంబంధించి ఈ నెల 25వ తేదీలోగా పూర్తిస్థా యిలో సమర్పించాలని తెలిపారు. జిల్లాలో ఆయా సంక్షేమ శాఖలు 2014 నుంచి 2022 వరకు వారు చేపట్టిన పనులకు సంబంధించి పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండా లని, నిర్ణీత గడువులోగా అన్ని ప్రగతి నివేదికలను సీపీవో కార్యాలయంలో అందించాలని సూచించారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయని, అందులో మేడ్చల్ నియాజక వర్గానికి సంబంధించి ఈ నెల 25వ తేదీన, మిగితా నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన అభివద్ధి, ప్రగతి నివేదికలను ఈనెల 30వ తేదీలోగా సమర్పించాలని అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో అప్పట్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను, ప్రస్తుతం ఉన్న వాటికి సంబంధించి స్పష్టమైన వివరాలు, అభివద్ధి, పురోగతి సంబంధిత ఫొటోలతో కూడిన ప్రదేశాలు, ప్రాజెక్టులు పూర్తి వివరాలతో నివేదిక రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం అధికారులు నిబద్దతతో పనిచేయాలని సమిష్టి కృషితో జిల్లాను అన్ని రంగాలలో ముందుండే విధం గా కృషి చేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, పోలీస్ అధికారులు, మున్సిపల్ కమి షనర్లు, ఆయా శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.