Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ-అంబర్‌పేట
ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుకో వడమే బీజేపీ లక్ష్యం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం క్రౌన్ ఫంక్షన్ హాల్లో అంబర్‌పేట నియో జకవర్గం పరిధిలోని బాగ్అంబర్ పేట డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌తో కలిసి మాట్లాడారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం ఏర్ప డిన తర్వాతనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నా రు. అంబర్‌పేటలో 20 ఏండ్లలో జరగని అభివృద్ధి గడిచిన నాలు గేండ్లలో జరిగిందని తెలిపారు. అన్ని కులాలు, మతాలతో ప్రజల మధ్య విబేధాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటున్న బీజేపీ గతంలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రస్తుతం కేంద్రమంత్రిగా నాలుగేండ్లలో సికింద్రాబాద్, అంబర్‌పేట నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. అభివృద్ధి పై చర్చకు వచ్చే దమ్ముందా అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరూ లేరన్నారు. యాదగిరిగుట్ట వంటి గొప్ప ఆలయ నిర్మాణం, ఆల యాల అభివృద్ధి, గొప్పగా పండుగలు నిర్వహించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అనంతరం బాగ్అంబర్ పేట డివిజన్‌కి చెందిన పలువురు బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ కుమార్ గౌడ్, బాగ్ అంబర్ పేట డివిజన్ అధ్యక్షులు చంద్రమోహన్, సీని యర్ నాయకులు డాక్టర్ సులోచన, మోర శ్రీరాములు ముదిరాజ్, అరుణ్ కుమార్ రెడ్డి, రవీందర్ రావు, నవీన్ యాదవ్, భాస్కర్ గౌడ్, కనివేట నర్సింగరావు, స్వామి, తదితరులు పాల్గొన్నారు.